OM Movie Review


Emotional Engagement Emoji


👎 Thumbs Down Emoji

మూవీ టైటిల్: OM

Banner : ఆర్ టేక్ స్టూడియోస్, వండర్ బార్ ఫిలిమ్స్ & ప్రైవేట్ లిమిటెడ్

Release Date : 20th నవంబర్ 2026

Censor Rating : ‘ U/A ,16+

Cast : ధనుష్ ,శ్రీ లీల,సాయి పల్లవి, మమ్ముట్టి, రేణు దేశాయ్, ఇంద్రన్స్, నాజీరుద్దీన్ షా,చైతూ జొన్నలగడ్డ తదితరులు

Director :రాజ్ కుమార్ పెరియసామి

Producer: శ్రద్దా అగర్వాల్ 

Music : సాయి అభ్యంకార్

Cinematography :ఎజిల్ అరసు

Editor :కలైవనన్ వార్

Runtime: 178 minutes


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘సార్’ ‘కుబేర’ సినిమాలతో అతని సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ధనుష్ నటించిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తూ వస్తున్నారు. అలా అని ప్రతి సినిమా ఇక్కడ అద్భుతాలు చేస్తుంది అని చెప్పడానికి లేదు. క్రేజ్ ఉన్న సినిమాలు మాత్రం ఇక్కడ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అదే విధంగా ‘O.M’ సినిమాకి తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. అందుకు కారణం ధనుష్ తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడం వల్లనే అని చెప్పాలి. మరి ఆ అంచనాలను సినిమా మ్యాచ్ చేసిందో లేదో తెలుసుకుందాం రండి

OM Movie Review


కథ

2014-15 టైమ్లో ఆంధ్ర-తమిళనాడు బోర్డర్‌లో జరిగే కథ ఇది. చిత్తూరు ప్రాంతంలో ఉండే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ డాన్‌గా ఎదుగుతాడు కార్తికేయన్ (మమ్ముట్టి). పిల్లలు లేకపోవడంతో భార్యను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. మరోవైపు కార్తికేయన్ రహస్య వ్యాపారాన్ని బయటపెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని, అతని ద్వారా ఈ వ్యాపారాన్ని విదేశాల నుండి శాసిస్తున్న క్రిమినల్ అబ్దుల్ హమీద్‌ను (నసీరుద్దీన్ షా) ఢీకొట్టాలని తపిస్తుంది నాయుడుపేటకు చెందిన పోలీస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి (సాయి పల్లవి).

ఈ క్రమంలో ఉన్నతాధికారి సలహా మేరకు తిరు అలియాస్ పళని (ధనుష్) సాయం తీసుకుంటుంది. ఓ ప్రమాదం నుండి కార్తికేయన్‌ను సేవ్ చేసి, తిరు అనే పేరుతో అతనికి దగ్గరవుతాడు పళని. తక్కువ టైమ్‌లోనే కార్తికేయన్‌కు రైట్ హ్యాండ్‌గా మారిపోతాడు. అతని ఫ్యామిలీకి కూడా బాగా దగ్గరవుతాడు. ఆ అవకాశాన్ని వాడుకుని కార్తికేయన్ బిజినెస్ వ్యవహారాలన్నింటినీ గుట్టురట్టు చేసేస్తాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి కార్తికేయన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? పళని భార్య రోజా (శ్రీలీల), కొడుకు అగర, తండ్రి షణ్ముగ మల్లి (ఇంద్రన్స్) జీవితాలు ఏమయ్యాయి? నిత్యా రెడ్డి గతం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు


ఈ సినిమాలో ధనుష్ మాత్రమే హీరో అనడానికి లేదు. ధనుష్ తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి చేసినవి కూడా లీడ్ రోల్స్ అనే చెప్పాలి. ఆర్డర్లో చెప్పుకుంటే ధనుష్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది. బాగా చేశాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఎందుకో రజినీకాంత్..ని ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మమ్ముట్టి ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపించారు. మమ్ముట్టి – ధనుష్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ‘దళపతి’ రోజులను గుర్తుచేస్తాయి. కాకపోతే యాక్షన్ సన్నివేశాలు చేయడానికి మమ్ముట్టి చాలా ఇబ్బంది పడ్డాడు. సాయి పల్లవి తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న సినిమా ఇది. నిత్యా రెడ్డి పాత్రని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని తన బెస్ట్ ఇచ్చింది. హెయిర్ స్టైల్ తో కూడా ఆకట్టుకుంది.

యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. రేణు దేశాయ్.. మమ్ముట్టి భార్యగా చేసింది. లిమిటెడ్ స్క్రీన్ అప్పీరెన్స్ ఉన్న పాత్ర ఇది. బాగానే చేసింది కానీ ఆమె కాస్ట్యూమ్స్ ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. శ్రీలీల.. ధనుష్ కి భార్య పాత్రలో ఓ బిడ్డకి తల్లిగా చేసింది. ధనుష్ ఏజ్ ను మ్యాచ్ చేయడం కోసం ఈమెకి మేకప్ తగ్గించారు. అయినా మ్యాచ్ కాలేదు. ఇంద్రన్స్ తండ్రి పాత్రలో బాగా చేశాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఎమోషన్ కి గురిచేయగలిగాడు. ఈ సినిమాలో చాలా మంది తెలుగు ఆర్టిస్టులు నటించారు. ముఖ్యంగా సీనియర్ నటుడు శివాజీ రాజాకి చాలా కాలం తర్వాత ఎక్కువ నిడివి కలిగిన పాత్ర లభించింది. దయానంద్ రెడ్డి పాత్ర, లుక్ కూడా బాగున్నాయి. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.

సాంకేంతిక నిపుణుల పనితీరు


 గతంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఆధారం చేసుకుని.. ముఖ్యంగా ఎర్రచందనం చెట్లని కొట్టే పనుల్లోకి వెళ్లిన దళిత కూలీలను అన్యాయంగా పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పాయింట్ ను ప్రధానంగా తీసుకుని ‘అమరన్’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయినప్పటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే అందరి మైండ్లోకి ‘పుష్ప’ సినిమా వచ్చేస్తుంది.

ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే ‘O.M’ విషయంలో ఎక్కడా కూడా ‘పుష్ప’ ఛాయలు రాకుండా దర్శకుడు తీసుకున్న కేరింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంది. మమ్ముట్టి- ధనుష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ లో ధనుష్ ఫాదర్ ట్రాక్ ఎపిసోడ్ తో సెకండాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకండాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని ఉండాల్సింది.

ఒకటే పాయింట్ చివరి వరకు సాగదీసిన ఫీలింగ్ కలిగింది. క్లైమాక్స్ లో మమ్ముట్టి – ధనుష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ తో సినిమా ఆపేసి ఉంటే బాగుండేది. కానీ ఒక ఫైట్ పెట్టి.. అందులో సాయి పల్లవి పాత్రని హైలెట్ అవ్వడానికి చేసిన ప్రయత్నం ల్యాగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక సంతృప్తికరమైన ఫీలింగ్ ఇవ్వదు. టెక్నికల్ గాచూసుకుంటే.. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా క్వాలిటీగా ఉంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ ఈ సినిమాకి మరో హీరో అని చెప్పాలి. ఫస్ట్ సాంగ్ బాగుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘వీర’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వచ్చే ఫారెస్ట్ ఫైట్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో.. కొంత పోర్షన్ ట్రిమ్ చేసి ఉంటే.. సినిమా వేగం పుంజుకునేది.

విశ్లేషణ


‘O.M’ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే.. ఒకసారి చూసే విధంగానే ఉంది. ధనుష్,మమ్ముట్టి, సాయి పల్లవి వంటి స్టార్స్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, సాయి అభ్యంకార్ మ్యూజిక్ మంచి కిక్ ఇస్తాయి. సెకండాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని ఉంటే దీని స్థాయి మరోలా ఉండేది.

 

ఫోకస్ పాయింట్: అక్కడక్కడా మెప్పించే ‘O.M’


Review By:

Hari Krishna